సిద్దిపేట జిల్లాలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కైంది. గ్రామ పంచాయతీలోనే రూ.15వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇళ్ల మ్యుటేషన్ కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా.. చివరికి రూ.15 వేలకు ఓకే చెప్పారు. కాంట్రాక్ట్ కారోబార్తో కలిసి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా.. వారిద్దరినీ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.


