HomeHeadlinesసూట్‌కేస్ భామ, పల్టీ భామ అంటూ సత్యభామపై ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు.. మండిపడ్డ టీవీకే

సూట్‌కేస్ భామ, పల్టీ భామ అంటూ సత్యభామపై ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు.. మండిపడ్డ టీవీకే

ధారాపురం ఉపఎన్నికల ప్రచారం వేళ ఎంకే స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. టీవీకే అభ్యర్థి సత్యభామను ‘సూట్‌కేస్ భామ’, ‘పల్టీ భామ’ అంటూ ప్రస్తావించిన స్టాలిన్‌.. ఆమె శరీరాకృతిని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీవీకే నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మహిళను అవమానించేలా స్టాలిన్‌ మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయంలో స్టాలిన్ క్షమాపణ చెప్పాలని పలువురు టీవీకే నేతలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సత్యభామ గతంలో ఏఐఏడీఎంకే తరఫున గెలిచి.. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరిన విషయం ఉపఎన్నికలకు కారణమైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments