అంతరిక్షంలోనే ఉపగ్రహాలను కూల్చివేసే క్షిపణి టెక్నాలజీ కలిగిన ప్రపంచంలోని నాలుగు దేశాల్లో భారత్ ఒకటి. భారత్ 2019లో అమెరికా, చైనా, రష్యాల సరసన చేరింది. అయితే, మార్చి 2019లో చేపట్టిన ఈ ప్రయోగం అగ్రరాజ్యం అమెరికాను కలవరానికి గురిచేసింది అని ఆ దేశ మాజీ నిఘా అధికారి తాజాగా వెల్లడించారు. ఆయన ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్ చేపట్టిన యాంటి శాటిలైట్ మిసైల్ పరీక్ష సమయంలో ఆందోళన చెందినట్టు తెలిపారు.


