HomeLifestyleగ్యాస్ ట్రబుల్ + వెన్ను నొప్పి + పీరియడ్స్ నొప్పులు తగ్గడానికి సాయపడే ఆసనం, స్టార్...

గ్యాస్ ట్రబుల్ + వెన్ను నొప్పి + పీరియడ్స్ నొప్పులు తగ్గడానికి సాయపడే ఆసనం, స్టార్ హీరోయిన్ చెప్పినట్టు రెగ్యులర్‌గా వేస్తే చాలు!

యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో యోగా సాయపడుతుంది. ఇక, సెలబ్రిటీలు కూడా యోగా ప్రాముఖ్యత గురించి సోషల్ మీడియాలో చెబుతూనే ఉంటారు. యోగాసనాల్ని ఎంతో సులభంగా, ఎలా వేయాలో చూపించడంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్‌గా ఆమె పంచుకున్న ఫిట్‌నెస్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఆమె ‘సుప్త వజ్రాసనం’ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.

యోగాలో ఈ ఆసనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆసనం వేయడానికి ఎంతో ఓపిక, నియంత్రణ, శరీరంపై ఏకాగ్రత అవసరం. దీనిని ” నిదానంగా చేసే ఒక స్ట్రెచ్. కానీ దీని వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం ఎంతో లోతైనవి” అని శిల్పాశెట్టి పేర్కొన్నారు. వేగంగా చేసే వ్యాయామాల కంటే శరీరాన్ని అర్థం చేసుకుంటూ నిదానంగా చేసే కదలికలే అత్యంత ప్రభావవంతమైనవి ఆమె తాజా వీడియో గుర్తుచేస్తుంది. సుప్త వజ్రాసనం రెగ్యులర్‌గా వేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments