దేశంలోనే తొలి ఎల్ఎన్జీ రైలు పట్టాలు ఎక్కింది. కేంద్రమంత్రి అమిత్ షా ఈ రైలును ప్రారంభించారు. డీజిల్‌తో పాటు ఎల్ఎన్జీతో పనిచేసే ఈ రైలులో 1400 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న రెండు డ్రైవింగ్ పవర్ కార్లను వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా డీజిల్ వినియోగాన్ని సుమారు 40 శాతం వరకు ఎల్ఎన్జీతో భర్తీ చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఇంధన ఖర్చు, ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. రైల్వే ఆధునీకరణపై మాట్లాడటంతో పాటు కాంగ్రెస్‌పై అమిత్ షా రాజకీయ విమర్శలు చేశారు.


