రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ ప్రజల్లో మాజీ సీఎం కేసీఆర్పై అభిమానం చెక్కుచెదరలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కేసీఆర్ను పోలిన పాత్ర కనిపించేది నాలుగు నిమిషాలే అయినప్పటికీ, థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ వేరే లెవల్లో ఉందని చెప్పారు. శాంతిభద్రతలు గాలికొదిలేసి డీజేలను బంద్ చేయడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్కు ఈ సినిమా మరో షాక్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. గడ్డిపోచ కూడా గడ్డపారలా మారి తిరగబడే నేల ఇదని హెచ్చరించిన కేటీఆర్, కేసీఆర్ స్థానం ప్రజల గుండెల్లో పదిలమని స్పష్టం చేశారు.
The Paradise: 3 గంటల సినిమాలో కేసీఆర్ 4 నిమిషాలు కనిపిస్తేనే థియేటర్లు షేక్ అవుతున్నాయ్ – కేటీఆర్
RELATED ARTICLES


