HomeEntertainmentరెండు రోజుల్లోనే రూ.114 కోట్లు... నిమజ్జనం రోజున కూడా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ ర్యాంపేజ్

రెండు రోజుల్లోనే రూ.114 కోట్లు… నిమజ్జనం రోజున కూడా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ ర్యాంపేజ్

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన రా అండ్ రస్టిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజు మిక్స్‌డ్ టాక్, సోషల్ మీడియా ట్రోల్స్ ఎదురైనప్పటికీ, కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలంగాణలో వినాయక నిమజ్జనం సందడి ఉన్నప్పటికీ, రెండో రోజు సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. అనిరుధ్ అందించిన పాటలకు థియేటర్లలో ప్రేక్షకులు డ్యాన్సులు వేస్తూ రచ్చ చేస్తున్నారు. ‘జడల్’గా నాని చూపించిన నట విశ్వరూపానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటంతో సినిమా మంచి జోరుతో దూసుకుపోతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments