ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరిసింది. ఏపీ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీకి గుడ్ గవర్నెన్స్ విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. ఆహార భద్రతలో విశిష్ట సేవలు అందించినందుకు ఈ పురస్కారం దక్కింది. ఎన్ జీ రంగా యూనివర్సిటీ స్కిల్ సెంటర్లు, డ్రోన్ సెంటర్లతో రైతులకు ఆధునిక సేవలు అందిస్తుంది.
ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఏపీ సత్తా.. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీకి స్కోచ్ గోల్డ్ పురస్కారం
RELATED ARTICLES


