HomeAndhra Pradeshఏకంగా రూ.26 వేలా? .. యానాం మార్కెట్‌లో 'చీరమేను' కోసం ఎందుకంత క్రేజ్?

ఏకంగా రూ.26 వేలా? .. యానాం మార్కెట్‌లో ‘చీరమేను’ కోసం ఎందుకంత క్రేజ్?

యానాం మార్కెట్‌లో బకెట్ చీరమేను ధర రూ.26 వేలు పలికింది. స్థానిక మత్స్యకార మహిళ నాటి పార్వతి ఈ చీరమేనును దక్కించుకుంది. ఈ చీరమేను కోసం చాలామంది పోటీ పడ్డారు. ఈ చేపలు మామూలు చేపల్లా ఉండవు. సన్నని దారపు పోగుల్లా, సేమ్యాల్లా ఉంటాయి. కానీ కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ చేపలు ఎప్పుడుబడితే అప్పుడు రావు. కేవలం వరదల సమయంలో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. కాగా గత ఏడాది అక్టోబర్‌లో కూడా చీరమేను ధర ఘనంగా పలికింది. యానాం మార్కెట్‌లోనే 10 లీటర్ల బకెట్ రూ.14 వేలకు వెళ్లింది
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments