HomeAndhra Pradeshవైసీపీలో తీవ్ర విషాదం.. సీనియర్ నేత, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కన్నుమూత

వైసీపీలో తీవ్ర విషాదం.. సీనియర్ నేత, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కన్నుమూత

Ysrcp Leader Kakumanu Rajsekhar Passed Away: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. రాజశేఖర్ మరణంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజశేఖర్ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. రాజశేఖర్‌ వైఎస్సార్‌సీపీకి అంకితభావంతో పనిచేశారని.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని.. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సంతాపాన్ని తెలియజేశారు. రాజశేఖర్ మరణంపై వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపాన్ని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments