HomeAndhra Pradeshధర్మవరం 2 Town పోలీస్ స్టేషన్లలో ‘PGRS’ ప్రహసనం.. విచారణ లేకుండానే స్పందన అర్జీల క్లోజ్.....

ధర్మవరం 2 Town పోలీస్ స్టేషన్లలో ‘PGRS’ ప్రహసనం.. విచారణ లేకుండానే స్పందన అర్జీల క్లోజ్.. బాధితుల గోడు పట్టని ఖాకీలు!

ఆఫీసుల్లో కూర్చుని ఆన్‌లైన్ మాయాజాలం చేస్తున్న పోలీసులు.. సీఎం చంద్రబాబు గారికి, సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి ‘KSN NEWS’ నేరుగా ఫిర్యాదు!

ధర్మవరం (KSN NEWS chief editor):

ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న PGRS (స్పందన) కార్యక్రమ ఉద్దేశాన్ని ధర్మవరం లోకల్ పోలీసులు నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.క్షేత్రస్థాయికి వెళ్లి బాధితుల సమస్యలను ప్రాపర్ వెరిఫికేషన్ చేయాల్సిన పోలీసులు, రికార్డులలో పెండెన్సీ తగ్గించుకోవడం కోసం అర్జీలను ఆఫీసుల్లో కూర్చునే ఏకపక్షంగా క్లోజ్ చేస్తున్నట్లు KSN NEWS పరిశీలనలో వెలుగు చూసింది.ఉన్నతాధికారుల రివ్యూ మీటింగుల ఒత్తిడి తట్టుకోలేక ‘సివిల్ వివాదం’ అనో, ‘ఇరువర్గాలు రాజీ పడ్డారు’ అనో కంప్యూటర్ల ముందే కూర్చుని తప్పుడు నివేదికలతో అర్జీలను ‘Disposed’ అని మారుస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.దీనిపై శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని KSN NEWS డిమాండ్ చేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments