ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి పారితోషికం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి వారికుండే ఫాలోవర్స్, రీచ్‌ని బట్టి కేటగిరీల వారీగా రూ.5 వేల నుంచి రూ.15000 వరకు చెల్లించనుంది. ఈ విషయాన్ని మంత్రి పార్ధసారధి వెల్లడించారు.
ప్రభుత్వ పథకాల ప్రచారానికి సరికొత్త రూట్, ఏపీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు క్యాష్ రివార్డులు
RELATED ARTICLES


