షాంపూ చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తారు? తలమీద నీళ్లు పోసుకుని.. షాంపూ రాసి.. కడిగేసి.. చివరగా కండిషనర్ పెట్టడం చాలామందికి అలవాటు. ఇదే సరైన పద్ధతి అనుకుంటాం. కానీ ఇప్పుడు హెయిర్ వాష్‌లో ఈ క్రమాన్ని కాస్త మార్చే శాండ్విచ్ మెథడ్ గురించి ఆసక్తి పెరుగుతోంది. ఈ పద్ధతిలో షాంపూకు ముందు కండిషనర్ రాయాలి. ఆ తర్వాత షాంపూతో స్కాల్ప్‌ను శుభ్రం చేసుకుని.. చివరగా మళ్లీ కండిషనర్ రాయాలి. అంటే కండిషనర్ మధ్యలో షాంపూ వస్తుందన్నమాట.
సాధారణంగా షాంపూ చేసిన తర్వాత జుట్టు డ్రైగా, రఫ్‌గా అనిపించే వారికి ఈ పద్ధతి ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. కండిషనర్ను ముందుగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడవు, చివర్లకు కొంత కండిషనింగ్ లభించవచ్చని, చివరగా మరోసారి కండిషనర్ రాయడం వల్ల జుట్టు సాఫ్ట్‌గా ఉండేందుకు సహాయపడవచ్చని IJPRA అధ్యయనం పేర్కొంది. మరి అసలు శాండ్విచ్ మెథడ్ అంటే ఏమిటి? దీన్ని ఎలా చేయాలి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అనే విషయాలను తెలుసుకుందాం.


