చాలా మందికి రోజూ అలసటగా అనిపించడం సహజమే. బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు అయ్యి ఉండొచ్చు. అయితే, రోజూ తగినంత విశ్రాంతి తీసుకున్నా తగ్గకుండా, వారాలు లేదా నెలల తరబడి కొనసాగే అలసట ఉంటే మాత్రం దాన్ని లైట్ తీసుకోకూడదు. శరీరంలో ఏదో తీవ్ర సమస్య మొదలైందనడానికి అది సంకేతం కావచ్చు. ఇక, లివర్ మన శరీరంలో ప్రధాన అవయవం. సైలెంట్‌గా, అలుపెరగకుండా పనిచేసే కీలక అవయవం. ఇది 500 కంటే ఎక్కువ పనుల్ని నిర్వహిస్తుంది.
వ్యాధి ముదిరేంత వరకు కాలేయం స్పష్టమైన హెచ్చరికలు లేదా లక్షణాల్ని చూపించదు. అందుకే లివర్ వ్యాధుల్ని తరచుగా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. కాలేయానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శరీరంలో నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు, వ్యాధి ముదిరిన తర్వాత కనిపించే సంకేతాలు, ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి అన్న పూర్తి వివరాల్ని డాక్టర్ రమాకాంత్ రెడ్డి ఎ, (కన్సల్టెంట్ – మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్), ఎల్బీ నగర్, హైదరాబాద్.) అందించారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.


