ఏషియన్ గేమ్స్ 2026 విమెన్స్ 60 కేజీ ఎంఎంఏ సెమీఫైనల్లో భారత అథ్లెట్ సుచిక తరియాల్ పోరాటం కాంస్య పతకంతో ముగిసింది. సింగపూర్ ఫైటర్ తెయోతో జరిగిన పోరు ఓవర్ టైమ్ తర్వాత డ్రాగా తేలింది. భారత ఫెడరేషన్ అప్పీల్ చేసినా.. రూల్స్ ప్రకారం, మ్యాచ్‌కు ముందు చూసిన బరువు ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. సుచిక కంటే తెయో 700 గ్రామాలు తక్కువ బరువు ఉండటంతో విజయం సింగపూర్‌కు దక్కింది.


