సిటీ లైఫ్స్టైల్లో మన ఇంటి బాల్కనీ కేవలం టీ తాగేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు మాత్రమే వాడుతుంటాం. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. కానీ గార్డెన్ కోసం ప్రత్యేకంగా స్థలం లేకపోవడంతో ఆ ఆలోచనను వాయిదా వేస్తుంటారు. నిజానికి చిన్న బాల్కనీ ఉన్నా కొన్ని మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు. అంతేకాకుండా అద్భుతమైన ఔషధ వనంగా కూడా ఉపయోగపడుతుంది.
మెడికల్ షాపులు, ఆర్టిఫిషియల్ సప్లిమెంట్లపై ఆధారపడకుండా పూర్వకాలం నుంచి మన ఇళ్లలో వాడుతున్న సహజసిద్ధమైన మొక్కలను బాల్కనీలోని చిన్న కుండీలలో ఎంతో సులువుగా పెంచుకోవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా గాలిని శుభ్రపరిచి బాల్కనీకి మంచి అందాన్నిస్తాయి. మన ఇంట్లోనే సులువుగా పెంచగలిగే అద్భుతమైన ఔషధ మొక్కలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం..


