బాడీలో ఏదైనా సమస్య వస్తే అది అంతటితోనే ఆగదు.. మొత్తం శరీరమంతటా మెల్లిమెల్లిగా వ్యాపిస్తుంది. ఇక షుగర్ ఉన్నవారికైతే చెప్పాల్సిన అవసరమే లేదు. సాధారణంగా షుగర్ వస్తే చిన్న సమస్యనైనా డాక్టర్‌ని కలిసి సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కాలిగోరు లోపలికి పెరగడమనేది చిన్న గోరు సమస్యే. కానీ, షుగర్ ఉన్నవారికి కాలిగోరు చుట్టుపక్కల చర్మంలోకి పెరిగినప్పుడు చర్మంలో చిన్న పగుళ్ళు, ఎరుపు, వాపు, నొప్పి వంటి సమస్యలొస్తాయి. ఎక్కువ రోజుల పాటు రక్తంలో షుగర్ కంట్రోల్ లేకపోతే చిన్న గాయం కూడా పెద్దగా మారొచ్చు. ఎందుకంటే, షుగర్ అనేది పాదాలలోని నరాల పనితీరు, రక్తప్రసరణలను ఎఫెక్ట్ చేస్తుందని డాక్టర్ నరేంద్ర బిఎస్(లీడ్ కన్సల్టెంట్, ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్)చెబుతున్నారు. అంతేకాకుండా, కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా డాక్టర్ తెలియజేస్తున్నారు.


