2026 ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, రికార్డు స్థాయిలో 13 సిక్సర్లతో 216/3 భారీ స్కోరు చేసింది. స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49*) మెరుపులు మెరిపించారు. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, దీప్తి శర్మ (3/6) దాటికి 69 పరుగులకే కుప్పకూలింది.


