HomeHeadlinesజూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ తీపి కబురు.. స్టైపెండ్ పెంపు, ఎంత పెంచారంటే..?

జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ తీపి కబురు.. స్టైపెండ్ పెంపు, ఎంత పెంచారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్ల ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. వారికి తీపి కబురు చెబుతూ.. స్టైపెండ్‌ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఇంటర్న్‌ హౌస్‌ సర్జన్లకు 10 శాతం, పీజీ డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు 5 శాతం పెంపు వర్తించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2026 జనవరి 1 నుంచి పెంచిన స్టైఫెండ్ అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పెంపుతో వేలాది మంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్‌ డాక్టర్లకు ప్రయోజనం కలగనుంది. గతంలో హౌస్‌ సర్జన్లకు రూ.25,906, పీజీ మొదటి ఏడాదికి రూ.60,823 స్టైపెండ్‌ ఉండేది. రాష్ట్రంలో సుమారు 9 వేల మంది జూనియర్‌ డాక్టర్లు సేవలందిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments