భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ, భార్య రితికతో కలిసి ముంబైలోని ‘లాల్‌బాగ్చా రాజా’ గణనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు. వీరి రాకతో అభిమానులు ‘రోహిత్.. రోహిత్’ అంటూ పరిసరాలను మారుమోగించారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు రోహిత్. తన అంతర్జాతీయ భవిష్యత్తుపై రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో బప్పా ఆశీస్సులు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


