చిన్నగా, పుల్లగా ఉండే ఉసిరికాయను మన ఇళ్లలో చాలాకాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి ఉసిరికాయ, ఉసిరి రసం, ఉసిరి పచ్చడి, పొడి ఇలా రకరకాలుగా తింటుంటారు. కేవలం రూ.5 కి లభించే చిన్న ఉసిరికాయలో దాదాపు 50 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఉసిరిని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదిగా చెబుతుంటారు. ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ సూపర్ ఫుడ్ గురించి సైన్స్ ఏం చెబుతోందో, నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..


