రన్నింగ్ చేసేటప్పుడు సరైన మోతాదులో నీరు ఆరోగ్యానికి, శరీర పనితీరుకు చాలా కీలకం. ఎందుకంటే చిన్నపాటి అజాగ్రత్త కూడా డీహైడ్రేషన్ లేదా ఓవర్హైడ్రేషన్కు దారితీస్తుంది.పరుగు తీసేవారికి శరీరంలో తగినంత నీటి శాతం (హైడ్రేషన్) ఉండటం చాలా కీలకం. చెమట రూపంలో నీరు బయటకు పోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం, ఏకాగ్రత, పనితీరు దెబ్బతింటాయి. అయితే అందరికీ ఒకే మోతాదులో నీరు సరిపోదు. పరుగు వ్యవధి, తీవ్రత, వాతావరణం, వ్యక్తిగత చెమట తీవ్రతను బట్టి ఇది మారుతుంది. రన్నింగ్ ముందు, మధ్యలో, తర్వాత ఎంత నీరు తాగాలో డాక్టర్ దిలీప్ గూడే (సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) తెలిపారు. దీంతో పాటు చాలా సందేహలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చుద్దాం.


