ఏపీలో త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజలు ఈ పోర్టల్ సందర్శించి తమ వివరాలను నమోదు చేసి.. ఓటు ఉందో, లేదో తెలుసుకునే వీలుంది.


