ఏపీలోని నాలుగు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందనే అంచనాతో బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు గంటలలో పిడుగులతో కూడిన వర్షం, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.


