మన రోజువారీ ఆహారంలో పెరుగు చాలా ముఖ్యమైన భాగం. రైతా, లస్సీ, మజ్జిగ, పెరుగు చట్నీ, మజ్జిగ పులుసు ఇలా రకరకాలుగా తీసుకుంటాం. కొందరికైతే భోజనం చివరలో పెరుగు లేకపోతే తిన్న తృప్తే ఉండదు. ఓ ముద్ద అయినా సరే పెరుగుతో తినాల్సిందే. పెరుగు ప్రోబయోటిక్ ఆహారం. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సాధారణంగా పెరుగు త్వరగా పుల్లబడకుండా, ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అయితే పెరుగును వారాల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఎన్ని రోజుల వరకు దీన్ని వాడొచ్చు అనే సందేహం చాలామందికి ఉంటుంది. రీసెర్చ్ గేట్‌లో పబ్లిష్ అయిన నివేదిక ప్రకారం పెరుగును ఎన్ని రోజుల వరకు ఫ్రిజ్‌లో పెట్టొచ్చు అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.


