తనను కేఏ పాల్‌తో పోలుస్తూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విజయవాడలో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన విజయసాయిరెడ్డి.. దసరాకు పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన ఆయన.. తనను విమర్శించే వారు చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. ఎన్ని పార్టీలు మారారో గమనించాలన్నారు


