ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ 2026 సదస్సు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు భారీ మోటార్ కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే ఈ రిహార్సల్స్ వల్ల నగరంలోని 22 ప్రధాన కేంద్రాల్లో మళ్లింపులు చేపట్టి.. 25కు పైగా ముఖ్యమైన రహదారుల్లో రాకపోకలను నియంత్రించనున్నారు. అత్యవసర వాహనాలకు మినహాయింపునిస్తూ.. సాధారణ ప్రయాణికులు మెట్రోను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.
ఢిల్లీ ప్రయాణికులకు బిగ్ అలర్ట్: 25 ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. తెలీకుండా వెళ్లారంటే ఇబ్బందులు తప్పవు!
RELATED ARTICLES


