ఒకప్పుడు ఆర్టీసీకి ఆదాయ వనరులుగా ఉన్న అంతర్రాష్ట్ర రూట్లలో ఇప్పుడు ప్రైవేట్ బస్సుల పోటీ తీవ్రంగా పెరిగింది. రాత్రి లగ్జరీ, స్లీపర్ బస్సులతోపాటు పగటి వేళల్లో తక్కువ ఛార్జీలతో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్–విజయవాడ వంటి కీలక మార్గాల్లోనూ ఆర్టీసీ ఆక్యుపెన్సీ తగ్గుతోంది. ఆర్టీసీకి పాత లగ్జరీ బస్సులు, తక్కువ హాల్ట్ పాయింట్లు, ఎక్కువ ప్రయాణ సమయం ప్రతికూలంగా మారాయి. సర్వీసుల రద్దుకు బదులుగా ప్రయాణికులను పెంచేందుకు సర్వేలు, లాయల్టీ పథకాలు, కొత్త హాల్ట్‌లు, ఏజెంట్ బుకింగ్ వ్యవస్థపై సంస్థ దృష్టి సారిస్తోంది.


