తమిళనాడు ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోట నుంచి శాసనసభ, సచివాలయాన్ని బయటకు తరలించేందుకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్థలం తక్కువగా ఉండడంతో… ఒకే ప్రాంగణంలో అన్ని వసతులు ఉండేలా నూతన సమీకృత సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాల్లోనే రూల్ 110 కింద సీఎం విజయ్ ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనుండగా.. కొత్త భవనాల కోసం గిండి, నందంబాక్కమ్ సహా నాలుగు ప్రాంతాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం.. సెయింట్ జార్జ్ కోట నుంచి తమిళనాడు సచివాలయం తరలింపు!
RELATED ARTICLES


