Krishna Janmashtami Astrology: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన శుక్రవారం నాడు శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈసారి రోహిణి నక్షత్ర కాలంలో చంద్రుడు తన ఉచ్చరాశి అయిన వృషభరాశిలో, గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో, సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలో, శుక్రుడు కూడా తన సొంత రాశి తులా రాశిలో నివాసం ఉంటారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున కుజుడు, శుక్ర గ్రహాల మధ్య నవపంచమ యోగం ఏర్పడనుంది. చంద్రుడు, గురు గ్రహాల మధ్య గజకేసరి యోగం, శుక్రుడు మాళవ్య రాజయోగాలను ఏర్పరచనున్నారు. దీంతో పాటు జయంతి యోగం, సర్వార్ధ సిద్ధి యోగం, హర్ష యోగం, హంస యోగం, బుధాదిత్య రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో వృషభం సహా కొన్ని రాశుల వారు తిరుగులేని విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.
Krishna Janmashtami Astrology: ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ ఏకంగా ఏడు అరుదైన యోగాలు.. ఈ 6 రాశులకు జాక్‌పాట్ ఖాయమా?
RELATED ARTICLES


