జీవితం అంతా ఈజీ కాదని మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమస్ అయిన అంజి మామ వెల్లడించారు. అనుకున్నవి అనుకున్నట్లు ఎప్పుడూ జరగవి అన్నారు. తన 14 ఏళ్ల యూట్యూబ్ కెరీర్లో సంపాదించింది జీరో అని వెల్లడించారు. మై విలేజ్ షో స్టార్ చేసిన తన మేనల్లుడు శ్రీకాంత్‌తో చిన్న చిన్న విభేదాల కారణంగా బయటకు వచ్చానని.. ఆ తర్వాత డబ్బుల కోసం సినిమాల్లో వేషాలు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కుటుంబం కోసం ఖాళీ సమయాల్లో డ్రైవింగ్‌తో పాటు ఎలక్ట్రీషీయన్ వర్క్ చేస్తున్నట్లు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.


