Post Office Time Deposit: తక్కువ రిస్క్ లేదా ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టేందుకు చాలా ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. అయిదే పోస్టాఫీసులు కూడా ఎఫ్డీ ఆఫర్ చేస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు. వీటిల్లో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అని ఉంటాయి. ఇక్కడ ఏడాది, 2, 3, 5 సంవత్సరాల వ్యవధితోనే ఉంటాయి. వీటి వడ్డీ రేట్లు, రాబడి లెక్కల గురించి తెలుసుకుందాం.


