తొలి టెస్టులో పొందిన పరాభవానికి ఆస్ట్రేలియా రెండో టెస్టులోనే గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. మ్యాకే వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్ తొలి రోజే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ఆసీస్ బౌలర్లు కేవలం 64 పరుగులకే చాపచుట్టేశారు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 10 ఓవర్లలో 6 మైడెన్లతో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీశాడు.


