కెనడాలోని బ్రిటిష్ కొలంబియా పరిధిలో ఉన్న అబాట్స్ఫోర్డ్లో భారత సంతతికి చెందిన ఒక మహిళకు అక్కడి స్థానిక అధికారులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. స్థానిక పార్కులు, పాఠశాల పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న సదరు మహిళను ఓ పౌరుడు కెమెరాలో చిత్రీకరించి నిలదీశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో.. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు, మహిళను గుర్తించి వేయి డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 69,000) భారీ జరిమానా విధిస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు.
భారత సంతతి మహిళకు కెనడాలో షాక్.. సరస్సులో చెత్త వేసినందుకు రూ.69 వేల జరిమానా
RELATED ARTICLES


