HomeAndhra Pradeshశ్రీశైలానికి భారీ వరద.. మళ్లీ ఎగువ నుంచి వస్తున్న నీరు

శ్రీశైలానికి భారీ వరద.. మళ్లీ ఎగువ నుంచి వస్తున్న నీరు

ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దాంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతానికి 875.50 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 అడుగులు కాగా, ప్రస్తుతానికి 165.92 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి 55,765 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇలానే కొనసాగితే జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి వెళ్లడం సాధ్యమే అని అధికారులు చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments