
పుట్టపర్తి, నవంబర్ 03: జిల్లా కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించారు.కంట్రోల్ రూమ్ నుండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు సరళిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జేసీ, ఆయా ప్రాంతాల కౌంటింగ్ కేంద్రాల అధికారులతో మాట్లాడారు. ప్రతి మున్సిపాలిటీలో కౌంటింగ్ నిర్వహణ, రౌండ్ల వారీగా వెల్లడవుతున్న ఫలితాలు, సిబ్బంది పనితీరు మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు.
JointCollectorMauryaBharadwaj #CollectorateCommandControlRoom #Puttaparthi #MunicipalCountingReview #SriSathyaSaiDistrict #RoundWiseResults #SecurityArrangements #StaffPerformance #TransparentCounting


