రాత్రంతా బాగా నిద్రపోయిన తర్వాత ఉదయం శరీరం, మనస్సు ఉల్లాసంగా ఉండాలి. అయితే, చాలా మందికి ఉదయం లేచివెంటనే తలంతా భారంగా అనిపిస్తోంది. మీ ఉదయం కూడా తలనొప్పి, భారం, అలసటతో ప్రారంభమైతే అది ఒక శారీరక సమస్యకు సంకేతం కావచ్చు. మీ శరీరంలో ఏదైనా సమస్య ఉన్నట్టు. చాలా మంది దీన్ని ఒక రోజువారీ సమస్యగా కొట్టిపారేసినప్పటికీ.. ఇది ఏదైనా ఒక లోపాన్ని సూచించవచ్చు.
అసలు ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది? టెన్షన్ హెడేక్, మైగ్రేన్, సైనస్ తలనొప్పుల మధ్య తేడాను ఎలా గుర్తించాలి? హై బీపీ వల్ల ఉదయం తలనొప్పి వస్తుందా? ఇలా ఎన్నో సందేహలకు డాక్టర్ మొహమ్మద్ ముజాహిద్ ఉస్మాన్ (సీనియర్ కన్సల్టెంట్, న్యూరో సర్జరీ, ఫోర్టిస్ హాస్పిటల్, కన్నింగ్‌హామ్ రోడ్, బెంగళూరు) పూర్తి వివరాలు అందించారు.


