కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు సఫారీ బ్యాటర్లు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శించారు. రియాన్ రికెల్టన్ (101), వియాన్ ముల్డర్ (115) అద్భుత శతకాలతో చెలరేగడంతో సౌతాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే ఆఖరి రోజు 288 పరుగులు చేయాల్సి ఉంది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్.. ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.


