ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారైంది! డిసెంబర్ 16న గోవా వేదికగా ఈ వేలం జరగనుంది!ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా అందించాల్సి ఉంటుంది. ఇక జూన్లో రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్), కుల్దీప్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్)ల మధ్య ట్రేడింగ్ జరగ్గా, ఇటీవల నటరాజన్ సన్రైజర్స్ హైదరాబాద్కు మారడం విశేషం. రిటెన్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్టర్ అయిన ఆటగాళ్ల జాబితా వెల్లడికానుంది.


