న్యూజిలాండ్తో జరిగే కీలక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. నవంబర్ 7 నుంచి లింకన్ వేదికగా జరగనున్న భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ మూడో అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్లో ఆడనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణ పొందుతున్న వీరిద్దరూ, మెయిన్ టెస్ట్ సిరీస్కు ముందు పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు ఈ మ్యాచ్ ఎంతగానో ఉపయోగపడనుంది.


