తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ తరహాలో నాలుగు ఆర్టీసీ టెర్మినళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. కాగా, హైదరాబాద్లోని ఉప్పల్లో రూ.3.22 కోట్లతో నిర్మించే కొత్త టెర్మినల్ ద్వారా రోజుకు లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఇప్పటి వరకు 367 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా.. రూ.12,888 కోట్లు ఆదా చేసినట్లు మంత్రి తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, ఉద్యోగుల బకాయిల చెల్లింపుతో ప్రజా రవాణాను బలోపేతం చేయనున్నట్లు వివరించారు.


