పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇతర అభ్యర్థులుగా డివైడ్ చేసింది. ఇక పోస్టల్ బ్యాలెట్ ప్యానెల్‌పై అభ్యర్థి పేరు, వారి పార్టీ పేరును మొదట తెలుగులో ప్రింట్ చేసి,దాని కింద ఇంగ్లీష్‌లో ముద్రించాలని SEC సూచించింది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు కొన్ని సార్లు కీలకంగా మారే అవకాశం ఉంది. పైగా కౌంటింగ్ రోజు ముందుగా పోస్టల్ ఓట్లనే లెక్కించడం జరుగుతుంది.
పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై గుర్తులు ఉండవు.. పేర్లు మాత్రమే… ఎస్ఈసీ కొత్త మార్గదర్శకాలు
RELATED ARTICLES


