HomeEntertainmentబాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ విధ్వంసం... పదో రోజు రూ. 24 కోట్లకు పైగా నెట్‌తో 'జైలర్...

బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ విధ్వంసం… పదో రోజు రూ. 24 కోట్లకు పైగా నెట్‌తో ‘జైలర్ 2’ సరికొత్త రికార్డు

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 10వ రోజైన రెండో శనివారం నాడు ఏకంగా 66.6 శాతం వృద్ధితో రూ. 24.15 కోట్ల ఇండియా నెట్ వసూళ్లను సాధించింది. తొలి వారంలో రూ. 334.35 కోట్ల నెట్ రాబట్టిన ఈ మూవీ, విదేశాల్లోనూ హవా చాటుతూ మొత్తం ఓవర్‌సీస్ కలెక్షన్లలో $25 మిలియన్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ తొమ్మిది రోజుల్లోనే రూ. 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ డబ్బింగ్ చిత్రాల జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments