శబరిమల అయ్యప్ప ఆలయానికి సరఫరా చేయాల్సిన 11 వేల లీటర్ల నెయ్యిని మళ్లించి.. దాని స్థానంలో తక్కువ ధర కలిగిన ఉత్పత్తిని సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ను అధికారులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్, లియో ట్రేడర్స్ సంస్థలకు అసలు నెయ్యిని తరలించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నకిలీ ఇన్వాయిస్లు ఉపయోగించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాల వల్ల ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సుమారు రూ.2.5 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు కొనసాగుతోంది.
శబరిమల అయ్యప్ప నెయ్యిలో అక్రమాలు.. 11 వేల లీటర్ల నెయ్యి మళ్లింపు, రూ.2.5 కోట్ల నష్టం, కాంట్రాక్టర్ అరెస్ట్!
RELATED ARTICLES


