నల్గొండ జిల్లాలోని దామచర్ల సమీపంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఐదో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. ట్రయల్ రన్ విజయవంతమైంది. పవర్ గ్రిడ్‌తో యాదాద్రి ప్లాంట్ ఐదో యూనిట్ అనుసంధానమైంది. మరోవైపు, ఈ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా కోసం మహానది కోల్‌ఫీల్డ్స్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం దీనిపై తుది ఒప్పందం బుధవారం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఐదు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమేఉన్నాయి.


