మదురైకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ దీపావళికి తనకు స్వీట్లు పంపాలని అడిగిన పాపానికి ఊహించని విధంగా ఈ- కామర్స్ సైట్లలో నకిలీ ఆర్డర్లు పోటెత్తాయి. తాజాగా, డ్యాన్స్ మాస్టర్ నాగరాజుకు సైతం ఇలాంటి విచిత్రమైన పరిస్థితే ఎదురయ్యింది. తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనను ఎవరు? టార్గెట్ చేశారో? వారికి తగిన గుణపాఠం చెబుతానని ఆయన హెచ్చరించాడు.


