దేశవ్యాప్తంగా అత్యంత గ్రాండ్గా జరుపుకునే పండుగల్లో విజయదశమి లేదా దసరా ఒకటి. ఈ పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. రావణాసురుడిపై శ్రీరాముడు విజయం సాధించిన సందర్భంగా, మహిషాసురుడిని దుర్గమ్మ సంహరించిన రోజైనందున ఈ పండగను జరుపుకుంటారు. ఇంటిల్లిపాదీ ఎంతో ఘనంగా జరుకుపునే పండగ ఇది. ఇంటికి బంధుమిత్రులు వచ్చి పిండి వంటల్ని ఆస్వాదించడమే కాకుండా ఆయుధ పూజ నిర్వహిస్తుంటారు.
ఇక, ఈ పర్వదినాన బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెబుతుంటారు. మీరు మీ కుటుంబ వేడుకలు, సాంప్రదాయ దుస్తుల ఫొటోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా వాట్సాప్ స్టేటస్ల ద్వారా పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఉపయోగపడే తెలుగు క్యాప్షన్లు, కోట్స్పై ఓ లుక్కేయండి.


