Emergency Fund Planning: మనలో చాలా మంది తమ తమ అవసరాల దృష్ట్యా లోన్లు తీసుకుంటుంటారు. ఇందులో ఎక్కువగా హోం లోన్ అనేది దీర్ఘకాలం చెల్లించాల్సిన బాధ్యతతో ఉంటుంది. ఈ ఈఎంఐ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు మీ లోన్ ఈఎంఐ చెల్లించడం పూర్తయ్యాక ప్రతి నెలా మిగిలే ఈఎంఐ మొత్తాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం వల్ల ఆర్థిక భద్రతను పెంచుకోవచ్చు. మరి ఇక్కడ ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.


