కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ల బెయిల్ విచారణ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. వీరిని ఉద్దేశపూర్వకంగానే జైలులోనే ఉంచేందుకు యంత్రాంగం రకరకాల సాకులు చెబుతోందని, ఎలాంటి ‘ఉపర్ సే ఆర్డర్స్’ (పైస్థాయి నుంచి రాజకీయ ఆదేశాలు) లేకుండా పారదర్శకంగా బెయిల్ మంజూరు చేయాలని సీజేపీ లీగల్ సెల్ ఘాటుగా స్పందించింది. మరి కస్టడీ ముగిసిన వీరికి ఇప్పటికైనా బెయిల్ మంజూరు చేస్తారా లేక శిక్ష వేస్తారా అని అంతా ఆలోచిస్తున్నారు.


