ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండుగ మొదలైందని గుర్తుచేసే క్షణం ఒకటి తప్పక వస్తుంది. అది దూరంగా ఉన్న మండపం నుంచి వినిపించే సాంప్రదాయ డప్పు శబ్దం కావొచ్చు, రోడ్డు పక్కన గాలికి ఊగుతున్న తెల్లటి కాశ పూలు కావొచ్చు. లేదా పొరుగింటి నుంచి వచ్చే సాంబ్రాణి పొగ, నేతి పిండివంటల సువాసన కావొచ్చు. ఒక్కసారిగా నగరమంతా కొత్త శోభను సంతరించుకుంటుంది. వీధులన్నీ విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతాయి, కుటుంబాలన్నీ కొత్త బట్టలు ధరించి బయలుదేరతాయి.
బంధువులు, పాత మిత్రులు, సహోద్యోగుల నుంచి ఫోన్లలో శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతాయి. మీరు పంపే సందేశాలు రొటీన్ ఫార్వర్డ్లా కాకుండా, మనసును హత్తుకునేలా ఉండాలంటే మీ కోసం ఇక్కడ సందేశాలు, కోట్స్, క్యాప్షన్ల సమాహారం ఉంది. వీటిని యథాతథంగా పంపొచ్చు. లేదా వారి పేరు, పాత జ్ఞాపకాల్ని జోడించి మరింత ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. ఈ ఏడాది దుర్గాష్టమి సందర్భంగా మీరు బంధుమిత్రులకు పంపగల విషెస్పై ఓ లుక్కేద్దాం.


